Old Telugu Songs Before 90s
SUBSCRIBE OUR WEBSITE
You Will Receive Latest Posted Songs Lyrics Of Our Website Straight To Your Email box.SUBSCRIBE NOW
Ee kovela neekai Song From Andaman Ammayi (1979) Movie Lyrics are written by Acharya Athreya. Song Sung By S.P Balu, P. Susheela Tollywood Song with music was given by K.V. Mahadevan
Ee kovela neekai Song Lyrics Basic Details:
| SONG | EE KOVELA NEEKAI |
|---|---|
| Movie | Andaman Ammayi (1979) |
| Singers | S.P Balu, P. Susheela |
| Music Composer | K.V. Mahadevan |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Saregama Music |
| Star Cast | Bala Krishna, Roja |
| Year | 1979 |
| Language | Telugu |
Ee kovela neekai Song
EE KOVELA NEEKAI SONG LYRICS IN TELUGU
పాట : ఈ కోవెల నీకై వెలిసింది
చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచన : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల, ఏస్ పి బాలు
పల్లవి
ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా.. నా దేవి తరలిరా
ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది
రా స్వామీ తరలి రా.. నా స్వామి తరలిరా
చరణం : (1)
దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
తిరునాళ్ళేపుడో రాక తప్పదని తేరును సిద్ధం చేసాను
దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
రేపటి కోసం చీకటి మూసిన తూరుపులాగా ఉన్నాను
తూరుపులాగా ఉన్నాను
ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా..నా దేవి తరలిరా
చరణం : (2)
నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే
నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే
ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డువేసే
ఆ..దేవుడేదో అడ్డువేసే
ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలిరా.. నా స్వామీ తరలిరా
రా దేవి తరలిరా.. నా స్వామీ తరలిరా
SHARE THIS LYRICS
Follow Us & Share On Social Pages
So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment
Please do not enter spam message in the comment box