Ee janmame {ఈ జన్మమే} Song Telugu Lyrics

Ee janmame {ఈ జన్మమే} Song Telugu Lyrics From Ulava Charu Biryani (2004) Movie

Ee janmame {ఈ జన్మమే} Song Telugu Lyrics From Ulava Charu Biryani (2004) Movie


ఈ జన్మమే పాట సాహిత్యం తెలుగులో

సినిమా పేరు             ఉలవచారు బిర్యానీ (2004)

పాడినవారు

ఖైలాష్ ఖేర్

స్వర కల్పన

ఇళయరాజా

రచన

చంద్రబోస్

నటీ నటులు

ప్రకాష్ రాజ్





Ee Janmame Song English Lyrics


పల్లవి 


ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా

ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా


వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో  నెయ్యికారు కూరలు వెయ్యెరా

అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగా చెయ్యెరా


ఈ జన్మమే 

ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా

ఈ జన్మమే

రుచి చూడడానికి దొరికెరా

ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా


చరణం 1


తాపేశ్వరంలోని మడతకాజా తెలుగులా అది తెగ రుచి

ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహు రుచి


నెల్లూరు చేపను తింటే నెలాళ్ళు నెమరేస్తారు

వేలూరు వేటను తింటే ఏడాది  మరిచిపోరు

వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతారు

కమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటారు


రుచులకే నవరుచులు తెలుపగా

పెదవిపై చిరునగవు నెలపరా


ఈ జన్మమే

రుచి చూడడానికి దొరికెరా

ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా

ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా


చరణం 2


వైశాకమాసాన ఉడుకులోనా కొబ్బరినే తాగు గడగడా

శ్రావణమాసాన ముసురులోనా కారబూంది తిను కర కరా


వీధుల్లో ఆలు బజ్జీ అహాహా ఎంతో రుచి

గుమ్మంలో గోలి సోడా ఓహోహో ఎంతో రుచి

అంగట్లో పానీ పూరి అబ్బబో ఎంతో రుచి

పొరుగింట్లో పుల్లకూర అన్నిట్లో  ఇంకా రుచి


రుచులతో అభిరుచులు కలుపుతూ 

మనసునే మధువనిగా మలచరా


జన్మమే రుచి చూడడానికి దొరికెరా

దొరికెరా దొరికెరా దొరికెరా


Ee janmame {ఈ జన్మమే} Song Credit

https://youtu.be/xkFCDtAsDS8



THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.


Post a Comment

Please do not enter spam message in the comment box