Life Of Ram [లైఫ్ ఆఫ్ రామ్] Song Lyrics in Telugu English

Life Of Ram [లైఫ్ ఆఫ్ రామ్] Song Telugu Lyrics


Life Of Ram [లైఫ్ ఆఫ్ రామ్] Song Telugu Lyrics 


పాట : లైఫ్ ఆఫ్ రామ్ 

చిత్రం : జాను (2020)

సంగీతం : గోవింద్ వసంత 

గానం : ప్రదీప్ కుమార్ 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 



ఏ దారేదురైనా ఎటు వెళుతుందో అడిగానా

ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా

ఏం చూస్తూ ఉన్నా..నే వెతికనా ఏదైనా

ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా

త్రుటిలో కరిగే కలనే అయినా

ఏం తేడా ఉందంట

నువ్వేవరంటూ అడిగితే నన్నెవరైనా

ఇల్లాగే కడదాక

ఓ ప్రశ్నై ఉంటానంటున్నా

ఏదో ఒక బదులై

నన్ను చెరపొద్దని

కాలాన్నడుగుతూ ఉన్నా


నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు

అనొద్దు దయుంచి ఎవరూ..

ఇంకొన్ని జన్మాలకి సరిపడు

అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు


నా ఊపిరిని ఇన్నాళ్లు గా

తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది

నా ఎద లయను కుశలము అడిగిన

గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి


ఉదయం కాగానే

తాజాగా పుడుతూ ఉంటా

కాలం ఇప్పుడే నను కనగా

అనగనగా అంటూనే ఉంటా

ఎపుడూ పూర్తవనే అవకా

తుది లేని కథ నేను గా


గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక

కాలు నిలవదు యే చోటా…నిలకడ గా

యే చిరునామా లేక.. యే బదులు పొందని లేఖ..

ఎందుకు వేస్తోందో కేక.. మౌనం గా


నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు

అనొద్దు దయుంచి ఎవరూ

ఇంకొన్ని జన్మాల కి సరిపడు

అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు


నా ఊపిరిని ఇన్నాళ్లు గా

తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది

నా ఎద లయను కుశలము అడిగిన

గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి


లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం

నాకే సొంతం అంటున్నా..విన్నారా..

నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా

రాకూడదు ఇంకెవరైనా


అమ్మ ఒడిలో మొన్న..

అందని ఆశలతో నిన్న..

ఎంతో ఊరిస్తూ ఉంది.. జాబిల్లి

అంత దూరానున్నా..

వెన్నెలగా చెంతనే ఉన్నా

అంటూ ఊయలలూపింది.. జోలాలి


Watch Life Of Ram [లైఫ్ ఆఫ్ రామ్] Song By Adhithya Music (YouTube )

https://youtu.be/2a34XyiZO14

Music Label : Adhithya Music (credit)


Life Of Ram [లైఫ్ ఆఫ్ రామ్] Song 

English Lyrics 


THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.

Post a Comment

Please do not enter spam message in the comment box