CHOOSENULE NAA KANULE (చూసెనులే నా కనులే చూడని వింతా) RARE MELODY BY SP BALU , SUSHEELA

Old Telugu Songs Before 90s

CHOOSENULE NAA KANULE (చూసెనులే నా కనులే చూడని వింతా) RARE MELODY BY SP BALU , SUSHEELA

Image Credit Goes To YouTube


Telugu Lyrics


చూసెనులే నా కనులే చూడని వింతా


చిత్రం: నేనూ మనిషినే (1971)

సంగీతం: వేద

గీత రచయిత: సి నారాయణ రెడ్డి 

గానం:  ఎస్ పి  బాలు, సుశీల


     : పల్లవి :


    చూసెనులే నా కనులే చూడని వింతా

    చూడగనే ఝల్లుమనే నా మనసంతా

    దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని

    వేచి వేచి వీలులేక వేగిపోతిని


    చూసెనులే నా కనులే చూడని వింతా

    చూడగనే ఝల్లుమనే నా మనసంతా

    దోచిన ఆ చూపులనే దాచుకుంటిని

    వేచి వేచి వీలులేక వేగిపోతిని..


    చరణం : 1 :


    పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు

    కానరాని ముల్లు ఎదలోన నాటినాడు

    పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు

    కానరాని ముల్లు ఎదలోన నాటినాడు

    ముళ్ళులేని గులాబిలు ముద్దులొలుకునా

    ఉరుము లేక మెరుపు లేక వాన కురియునా


    చూసెనులే నా కనులే చూడని వింతా

    చూడగనే ఝల్లుమనే నా మనసంతా

    దోచిన ఆ చూపులనే దాచుకుంటిని

    వేచి వేచి వీలులేక వేగిపోతిని..


    చరణం : 2 :


    కలల మేడలోన నను ఖైదు చేసినాడు

    కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు

    కలల మేడలోన నను ఖైదు చేసినాడు

    కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు

    కలల కన్న మధురమైన కాంక్షలుండునా

    వలపులోన ఖైదుకన్న తలుపులుండునా


    చూసెనులే నా కనులే చూడని వింతా

    చూడగనే ఝల్లుమనే నా మనసంతా

    దోచిన ఆ చూపులనే దాచుకుంటిని

    వేచి వేచి వీలులేక వేగిపోతిని..


    చరణం : 3 :


    విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే

    కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే

    విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే

    కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే

    విరహ రాత్రి రేపు మాపు కరగకుండునా

    వేచి యున్న వేగు పూలు విరియకుండునా


    చూసెనులే నా కనులే చూడని వింతా

    చూడగనే ఝల్లుమనే నా మనసంతా

    దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని

వేచి వేచి వీలులేక వేగిపోతిని..

CHOOSENULE NAA KANULE (చూసెనులే నా కనులే చూడని వింతా) Online Video Song Credit Goes To YouTube

Music Label : Saregama India Limited


THANKS FOR LYRICS READING 
SHARING IS CARING

 SHARE THIS LYRICS 

Follow Us & Share On Social Pages 

So More People Can Watch, Read And Enjoy It.


Post a Comment

Please do not enter spam message in the comment box

Previous Post Next Post